Loading...
Tuning in to your content...
Preparing your experience...
Command Palette
Search for a command to run...
Kathakaalaamsam - Stories, Music & Podcasts
Fantasy
Telugu
Story
తను
By Sairam Chaganti
•
about 2 months ago
20 views
2 likes
Login to Like
Share
Story
ఆడుతున్న వేళ తనతో కలిసి ఆడాలని వేచి చూసే ఆ ఆకులకి తెలుసు
తమ సడినే తాళంగా చేసుకుని ఆమె ఆడేవేళ ఎంత ఆనందమో ఆ చినుకులకి తెలుసు
అలా ఆడుతున్న సమయాన మయూరమే మైమరచి చూసే ఆనాట్యం తనకేసొంతం
గుండెలయలను శృతి-చేసే ఆమె నయన మనోహర నాట్యం చూడాలి అంటే...
కారుమబ్బులు ,నీటి చుక్కలు
వీచేగాలి పిలిచే ఆకాశం కలిసి రావాల్సిందే..
ఎగసి పడే అలల ప్రక్కన, చిన్నగా మండుతున్న చలిమంట ముందర గాలినే శృతిగా చేసి, ఇసుకలోనే తాళం వేసి, పంచభూతాలే ప్రేక్షకులై, ప్రపంచమనే వేదికపై
తను ఆడాలి.....అది చూడాలి.....
-కథకుడు
Login to view and post comments
Login