స్వేచ్ఛాపావురం హద్దు దాటి ఎగురుతోంది... కదలాల్సిన యువ చైతన్యం కాళ్ళు కట్టేసుకుని కూర్చుంది దేశ ఐక్యత కోసం చూసే రోజులు కానవచ్చి చాలా రోజులు అయ్యింది చీకటిలో అవినీతి చేసే నృత్యం రోజురోజుకి పెరుగుతోంది అబద్ధాన్ని ఆయుధంగా చేసుకున్న సంస్థలు దేశాన్ని ఏలుతున్నాయి నిజం కోసం నిలబడే ఆలోచన కరువైంది...కనుమరుగయ్యేలా ఉంది ఇన్నాళ్లు గుట్టుగా జరిగినవన్నీ ఈరోజు లీగల్ అయ్యాయి అంతర్జాలపు గాలం అందరినీ పట్టేసింది తనకి కట్టేసింది అక్కర్లేని ఆనందాన్ని వెతికే అలవాటు పోనంది న్యాయం సంగతి పక్కన పెడితే ధర్మం చెప్పే మాట చేదు అయ్యింది చీకటిని చెరిపే రవికిరణంలా భారతాన్ని చూస్తున్న ప్రపంచాల నడుమ భారతీయుడికి దేశ చరిత్ర తెలియని రోజు ఎదురయింది పంచుకుంటే ఆనందం పెరుగుతుందని...బాధ తగ్గుతుందని అనే రోజులు ఎప్పుడో పోయాయి సెక్యులరిజం పేరుతో మత రాజకీయ విషాన్ని నింపుకున్న పాములు కాచుకునే ఉన్నాయి అభివృద్ధి పేరుతో అవినీతి చేసే మదపుటేనుగులు విర్రవీగుతూనే ఉన్నాయి ఎనభై వసంతాల నుంచి దేశం అభివృద్ధి పథం లో నడుస్తూనే ఉంది ఒక చిన్న ప్రశ్న ! ఏం చేస్తున్నాం అని..! మనకి మనం వేసుకుంటే నిద్ర పట్టదు అని తెలిసే ఆ ప్రశ్న వదిలేస్తున్నాం... జాడ్యం వదిలి కదిలితే సమాధానం దొరికే అవకాశం లేకపోలేదు ఇజాల నిజాలు తెలియకుండానే తన్నుకోడం ఈ వత్సరంలో అయినా మారాలి. నా దేశం విశ్వగురువు అయ్యే తరుణానికై మన అడుగులు పడాలి..! విశ్వమాత భారతావని యశోగీతి వినిపించగ గళము కలిపి పాడుతాం వందేమాతరం... కదము తొక్కి చెపుదాం మనదే ఈతరం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!