కిరాణా కొట్టు రంగారావు, బట్టల కొట్టు రామారావు మంచి స్నేహితులు. రంగారావుకి ఆ కిరాణా కొట్టు తన తండ్రి దగ్గర నుంచి వచ్చింది, రామారావు స్నేహితుడు కావడం వలన ఇతని కొట్టు పక్కనే ఇంకొక కొట్టు అద్దెకు తీసుకుని రామారావుతో బట్టల వ్యాపారం పెట్టించాడు. ఇద్దరివీ ఊర్లో మంచి పేరు గడించిన వ్యాపారాలే. ఇద్దరికీ లాభాలు బాగున్నాయి.
రామారావు కొడుకు చదువుకుని ఇంజనీర్ అయ్యాడు, రంగారావు కొడుకు పెద్దగా చదవకపోయినా వ్యాపారాన్ని చూసుకోవడంలో తండ్రికి తగ్గ తనయుడే. రామారావు కొడుకు ఊరు వదిలి ఎగిరిపోయాడు. ఉద్యోగం చేస్తున్నాడు కానీ ఎప్పుడెప్పుడు తండ్రిలా దుకాణం చూసుకుంటానా అని ఆశ పడుతున్నాడు. అతనికి ఎవరి దగ్గరో పని చేస్తూ ఆ రూపాయి కోసం చూడటం ఇష్టం లేదు. తండ్రికి కొడుకుతో ఈ వ్యాపారం చేయించడం ఇష్టం లేదు. కొడుకు అతనిలా కాకుండా మంచి ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించాలనేది రామారావు కోరిక.
హఠాత్తుగా రామారావుకి జబ్బు చేసింది. కొడుకును పిలిచే అంత పెద్దది కాదు కానీ ఉంటే ఆ ధైర్యం వేరు కదా. రంగారావు, అతని కొడుకు కలిసి పట్నం తీసుకెళ్లి వైద్యం చేయించారు. కొడుకుకి విషయం తెలిసి వెంటనే వచ్చేసాడు. వచ్చిన ప్రతిసారి బట్టల కొట్టులో కూర్చోడానికి ప్రయత్నించడం అది వీలుకాకపోవడం జరిగేది.
ఈ సారి జబ్బు చేసి నెల రోజులు అయింది. కొన్నాళ్లు తగ్గుతుందేమో అని చూశారు, రంగారావు అతని కొడుకు చాలా వరకు సాయం ఉన్నారు కానీ ప్రయోజనం లేదు. కొడుకు పట్నం నుంచి ఊడిపడ్డాడు. అతని ఆగమన వార్తతో పాటు అప్పు ఇచ్చిన వాళ్లు కూడా వచ్చారు. రామారావుకి అప్పు ఉంది అనే విషయం ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. భార్యతో సహా అందరికీ ఆశ్చర్యమే. ఎక్కువ సమయం లేదు అని తేల్చి చెప్పేసారు డాక్టర్లు. ఎలాగూ పోతున్న తండ్రి దగ్గర ఆస్తి తీసుకుందాం అని, ఆ బట్టల కొట్టులో కూర్చుందాం అని అనుకుంటున్నాడు ఇతను. ఈ లోగా ఆ దుకాణం చిక్కుల్లో ఉంది అని తెలిసేసరికి కొడుక్కి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది.
అప్పు తీర్చకుండా కదిలేది లేదు అని పట్టు పట్టిన షావుకారుకి నచ్చ చెప్పి రంగారావు ఆ దుకాణాన్ని కొన్నాళ్లు కాపాడారు. రామారావుకి పరిస్థితి అర్థం అయింది. వ్యాపారం నిలబడాలి అంటే కచ్చితంగా చెయ్యి తిరగాలి. తిప్పే నాథుడు లేడు, కొడుకేమో అనుభవం లేనివాడు, తను పొరపాటున కూడా మంచం దిగి వచ్చే పరిస్థితిలో లేడు. మొత్తానికి తర్జనభర్జనల తర్వాత ఆ దుకాణంలో కొడుకు కూర్చున్నాడు. తడబడుతున్న కొడుక్కి వ్యాపారం రాదు. రంగారావు కొడుకు దగ్గర ఉండి మెలకువలు చెప్పుకుంటూ వచ్చాడు. తండ్రి ఎలాగూ సలహాలు ఇస్తూనే ఉంటాడు. మొత్తానికి అతనికీ వ్యాపారం అలవాటు అయింది.
షావుకారు తగ్గి కుర్రాడిని నమ్మి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. మొన్న ఆ మధ్య వచ్చిన పక్షవాతానికి కాళ్లు చేతులు ఆడకుండా పడి ఉన్న రామారావుని అతని కొడుకు చూడకపోగా వచ్చిన లాభం మొత్తం అతనే తినేసి ఇంటికి నష్టం చూపించేవాడు. వ్యాపారంలో అటుపోట్లు తెలిసిన తండ్రికి విషయం అర్థం అయింది. కొడుక్కి అప్పు ఎగ్గొట్టే ఉద్దేశం ఉంది అని అర్థం అయింది. చెప్పి చూశాడు కానీ ప్రయోజనం లేదాయే. రంగారావుతో మాట్లాడి అప్పు మొత్తం తీర్చేశాడు. ఆస్తితో పాటు అప్పు ఇచ్చావు అని రోజూ వేధిస్తున్న కొడుకు బాధ కాస్త తగ్గింది.
అప్పు అయితే తీర్చేశాడు కానీ, కొడుకు చేస్తున్న మోసం చూసి తట్టుకోలేని రామారావు ఇంకా కుంగిపోయాడు. సొంత బిడ్డ అలా చేసేసరికి రామారావు ఆలోచనలన్నీ పెరిగి, గుండెపోటుతో చనిపోయాడు. కార్యక్రమాలన్నీ చేయడానికి కొడుకుతో పాటు రంగారావు కూడా ముందుకు వచ్చాడు. కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి. తన తండ్రి రంగారావు సహాయంతోనే అప్పు తీర్చాడని కొడుకుకు తెలుసు, ఏమి మాట్లాడలేదు, రంగారావు అడగనూ లేదు. రామారావు చేసిన అప్పు, స్నేహం పేరుతో తీర్చేసిన రంగారావు మరలా అడగడు, బాధ్యత తీసుకుని కొడుకు ఇవ్వడు. ఆ అప్పు విషయం రంగారావు రామారావుతో పాటే కాటికి పంపేశాడు.
మళ్లీ అన్నీ మాములు అయిపోయాయి, తండ్రి స్థానంలో కొడుకు కూర్చుని చక్రం తిప్పుతున్నాడు. తోడుగా రంగారావు కొడుకు పక్కనే ఉండి సాయం చేస్తున్నాడు. వ్యాపారం బాగానే సాగుతోంది. అప్పు ఇచ్చిన వాడు సంతోషంగానే ఉన్నాడు, అప్పు తీర్చిన వాడు ఆ విషయం పట్టించుకోవట్లేదు. అవేమీ పట్టనట్టు కొడుకు వ్యాపార లావాదేవీలు చూస్తున్నాడు. అన్ని బాగున్నా.. సర్వస్వం అనుకున్న భర్తని పోగొట్టుకున్న రామారావు భార్య మాత్రం గోడకు వేలాడుతున్న రామారావు ఫోటో చూస్తూ ఏడుస్తోంది.